స్టార్ హీరో సూర్య నూతన చిత్రం సీన్ టైటిల్ గ్లింప్స్ విడుదల
రిపోర్టర్: రాము
స్థలం: చెన్నై
స్టార్ హీరో సూర్య నటిస్తున్న 47వ చిత్రానికి సీన్ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆవేశం ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య డిఎస్‌పి ప్రేమ్‌రాజ్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.