కొండగట్టుకు శాశ్వత తాగునీటి భద్రత: రూ.21.20 కోట్లతో ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: కిరణ్ స్థలం: జగిత్యాల

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని, రూ.21.20 కోట్ల నిధులతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక కృషితో ఇందిరమ్మ వరద కాలువ నుంచి నీటిని తరలించి భక్తుల ఇబ్బందులను తొలగించడంతో పాటు మల్యాల మండలం ముత్యంపేట సమీపంలోని సంతల్లోద్ది చెరువును అభివృద్ధి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.