ఏన్కూరులో అడవిని తలపిస్తున్న ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలోని సీఎల్ఆర్సీ, పాత ఏపీడీ, ఐకేపీ, భవిత భవనం తదితర ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు పిచ్చి మొక్కలతో అడవిని తలపిస్తున్నాయి. కార్యాలయాల చుట్టూ ఏపుగా పెరిగిన చెట్ల వల్ల పాములు, తేళ్లు సంచరిస్తూ ప్రజలను, ఎస్టీ హాస్టల్ విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పిచ్చి మొక్కలను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.