రామ్‌చరణ్ సుకుమార్ కాంబోలో భారీ చిత్రం: త్వరలో లాంఛనంగా ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
రంగస్థలం చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన రామ్‌చరణ్, సుకుమార్ ద్వయం కలయికలో మరో భారీ చిత్రం రాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఆర్సీ17 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సాంకేతిక నిపుణుల ఎంపికపై కసరత్తులు జరుగుతుండగా, లాంచింగ్ రోజే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.