భారత మార్కెట్లోకి ఆధునిక హంగులతో నోకియా ఫోన్ విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
డిజిటల్ యుగంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకునేవారి కోసం హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ సరికొత్త నోకియా 3210 ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ప్రారంభ ధరను రూ.4,299గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. రెట్రో లుక్, ఫిజికల్ కీప్యాడ్ డిజైన్తో పాటు 4జీ కనెక్టివిటీ, యూపీఐ పేమెంట్స్ వంటి ఆధునిక ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. విద్యార్థులు, ప్రయాణాల్లో బ్యాకప్ ఫోన్ కోరుకునేవారికి ఇది చక్కటి ఎంపికని నిపుణులు పేర్కొన్నారు.