బెల్లంపల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. వాహనాల తనిఖీ
రిపోర్టర్: NARESH
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి సుభాష్‌నగర్ బస్తీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు చెప్పవద్దని హెచ్చరించారు.
కార్యక్రమంలో భాగంగా 30 వాహనాలను తనిఖీ చేసి ధ్రువపత్రాలను పరిశీలించారు. ఎస్ఐ తిరుపతి, ఏఎస్ఐ తిరుపతితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నేరాల నియంత్రణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.