హుకుంపేటలో పొంగిపొర్లుతున్న వాగులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: హుకుంపేట
భారీ వర్షాల కారణంగా హుకుంపేట మండల కేంద్రంలోని పలు పంచాయతీలకు వెళ్లే మార్గాల్లో బ్రిడ్జిలపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీనివల్ల వాగులు పొంగిపొర్లుతుండటంతో ఆ మార్గాల గుండా ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలు నిలిచిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.