ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రవేశాల గడువు పొడిగింపు

రిపోర్టర్: కిరణ్ స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 2026 పీహెచ్‌డీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించారు. ఎన్‌ఈపీ కింద నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించారు. ఆసక్తి గల అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.