అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ సొంతంగా రహదారి గుంతలు పూడ్చిన గిరిజనులు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: జి.కె.వీధి

అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం జర్రెల పంచాయతీ పరిధిలోని ఆరు గిరిజన గ్రామాలకు వెళ్లే రహదారి వర్షాల కారణంగా గుంతలమయమైంది. దీనితో పేసా ఉపాధ్యక్షుడు వి. బాలకృష్ణ, మాజీ వాలంటీర్ ఏ. సన్యాసిరావు శ్రమదానం చేసి గుంతలను పూడ్చారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే శాశ్వత రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.