టెక్ ప్రపంచంలో సంచలనం: వివో నుంచి సరికొత్త మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ టెక్ దిగ్గజం వివో సంస్థ సరికొత్తగా అభివృద్ధి చేసిన మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ వివో విజన్ డిస్కవరీ ఎడిషన్ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు నిపుణులు వెల్లడించారు. యాపిల్ విజన్ ప్రో డిజైన్ను పోలి ఉండే ఈ డివైజ్ కేవలం 398 గ్రాముల బరువుతో అత్యంత తేలికగా ఉంటుందని, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ చిప్సెట్ తో పాటు ఒరిజిన్ ఓఎస్ విజన్ ఆపరేటింగ్ సిస్టమ్పై ఇది పనిచేస్తుందని టెక్ నిపుణులు పేర్కొన్నారు.