ఏపీలో యథావిధిగా పరిషత్ ఎన్నికలు: స్పష్టం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ లో జిల్లా మరియు మండల పరిషత్ ఎన్నికలు ముందుగా నిర్ణయించిన ప్రకారమే యథావిధిగా కొనసాగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తుపాను ప్రభావంపై బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఎస్ఈసీ ఈ కీలక ప్రకటన వెలువరించింది. వర్షాలు తగ్గుముఖం పట్టినందున పోలింగ్ ఏర్పాట్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు నివేదించడంతో, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది.