హోమ్ లోన్ కస్టమర్లకు అలర్ట్: పత్రాలు ఇవ్వకుంటే రోజుకు రూ.5 వేలు పరిహారం
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
గృహ రుణాన్ని పూర్తిగా చెల్లించిన వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ముప్పై రోజుల్లోగా ఆస్తి పత్రాలు అందించాలని అధికారులు స్పష్టం చేశారు. పత్రాలు ఇవ్వడంలో బ్యాంకులు విఫలమైతే ఆలస్యమైన ప్రతి రోజుకు ఐదు వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని వెల్లడించారు. చివరి ఈఎంఐ చెల్లించిన తర్వాత ఆస్తిపై నమోదైన తనఖా ఛార్జీలను తొలగించుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.