గుర్గావ్‌లో రోడ్డు రేజ్ కలకలం, మహిళా బైకర్‌ను ఢీకొట్టిన కారు

రిపోర్టర్: శివ స్థలం: హరియాణా

గుర్గావ్‌లో రెండు వేర్వేరు రోడ్డు రేజ్ ఘటనలు కలకలం రేపాయి. గోల్ఫ్ కోర్స్ రోడ్డులో వెళ్తున్న మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి పరారైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. మరో ఘటనలో రిటైర్డ్ ఐఏఎఫ్ అధికారిపై పార్కింగ్ సిబ్బంది ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డారు.