తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: గోపి
స్థలం: Telangana
తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా, కారణాలు చెప్పకుండా తనను బర్తరఫ్ చేయడం అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారని, కానీ తనకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొంటూ, ఈ నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.