అక్టోబర్ 1 నుండి దేశవ్యాప్తంగా కొత్త జనన మరణాల చట్టం అమలు
రిపోర్టర్: రమేష్
స్థలం: భారతదేశం
దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణ చట్టం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రపతి ఆమోదం లభించడంతో భారత రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యాసంస్థలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, పాస్పోర్ట్ వంటి అన్ని సేవలకు డిజిటల్ జనన ధ్రువీకరణ పత్రాన్ని ఏకైక ప్రామాణిక పత్రంగా పరిగణించేలా ఈ చట్టంలో మార్పులు చేశారు.