ఎమ్మెల్యే నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసిన నూతన పీఏసీఎస్ పాలకవర్గం
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్మన్గా ఎన్నికైన అభిడి రాజిరెడ్డి, తన పాలకవర్గ సభ్యులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూలగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం, సహకార సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని చైర్మన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.