రిమ్స్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్న గవ్వల శ్రీకాంత్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

అదిలాబాద్ రిమ్స్ లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం జన్నారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటనలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.