ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలని సీఈవో సుదర్శన్‌రెడ్డి హుకుం
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నూతన ఓటరు నమోదు, దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.