అమెరికాలో అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే అమీబాను గుర్తించిన నాసా
రిపోర్టర్: రాము
స్థలం: California
అమెరికాలోని కాలిఫోర్నియా లాసెన్ వోల్కానిక్ నేషనల్ పార్క్లో అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సరికొత్త అమీబా జాతిని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫైర్ అమీబాగా పిలిచే ఈ జీవి 63 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా సంతానోత్పత్తి చేయగలదని పరిశోధకులు తెలిపారు. సంక్లిష్టమైన కణ నిర్మాణం కలిగిన యుకారియోట్ జీవులలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అని నాసా వెల్లడించింది.