మురసు తుపాను ముప్పు: పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్

రిపోర్టర్: రాము స్థలం: నెల్లూరు

మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. ఈ ఉత్తర్వులను అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు విధిగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.