వేగంగా బాసర సరస్వతి ఆలయ పునర్నిర్మాణ పనులు
రిపోర్టర్: రాము
స్థలం: నిర్మల్
తెలంగాణలోని ప్రసిద్ధ బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. పుష్కరాల నాటికి పనులను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు చర్యలు వేగవంతం చేశారు. రూ.20 కోట్లతో పుష్కర ఘాట్ల అభివృద్ధి, ఆలయ విస్తరణతో పాటు భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.