బెంగళూరులో ప్రంక్ వీడియో పేరుతో బాలుడి దారుణ హత్య
రిపోర్టర్: కిరణ్
స్థలం: Bengaluru
బెంగళూరులో పదమూడేళ్ల బాలుడు ప్రాజ్వల్ హత్య ఉదంతం కలకలం రేపింది. ప్రంక్ వీడియో తీస్తున్నామని నమ్మించి బాలుడితో కిడ్నాప్ డ్రామా రికార్డు చేసి కోటి రూపాయల రాంసమ్ డిమాండ్ చేయాలని నిందితులు భావించారని పోలీసులు వెల్లడించారు. విదేశాల్లో చదువుకున్న ప్రధాన నిందితుడు భాస్కర్ రెడ్డి తన సహచరుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడని, రోడ్డు ప్రమాదం కారణంగా ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చిందని పోలీసులు స్పష్టం చేశారు.