తాడిపత్రిలో ఉద్రిక్తత: పోలీస్ స్టేషన్ ఎదుట మంచం వేసి జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన

రిపోర్టర్: కృష్ణ స్థలం: Ananthapuramu

తాడిపత్రిలో టీడీపీ నాయకులపై జరిగిన దాడిని నిరసిస్తూ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ బయట మంచం వేసుకుని నిరసనకు దిగారని పోలీసులు తెలిపారు. తిమ్మంపల్లిలో పార్టీ శ్రేణులపై దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు తన ఆందోళన విరమించేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.