తిరుపతి అభివృద్ధికి భారీ ఊరట: ముప్పై రెండు వందల కోట్లతో పనులకు శ్రీకారం
రిపోర్టర్: గోపి
స్థలం: తిరుపతి
తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపన చేసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మూడు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. తిరుమల కొండపై రద్దీ తగ్గించేందుకు కింద తిరుపతిలో వసతి సౌకర్యాలు, ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్, మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు పేర్కొంటూ భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.