ఐపీ టీవీ ఛానళ్లకు అక్రెడిటేషన్లు ఇవ్వలేమని స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఐపీ టీవీ న్యూస్ ఛానళ్లకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇరవై ఆరు వేల కార్డులు జారీ చేశామని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య నేతృత్వంలో ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.