తారక్ మెహ కా ఉల్టా చష్మా సెట్ లో భావోద్వేగానికి గురైన మున్మున్ దత్తా
రిపోర్టర్: సురేష్
స్థలం: ముంబై
ప్రముఖ టెలివిజన్ ధారావాహిక తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో బబితా ఐయర్ పాత్రతో గుర్తింపు పొందిన నటి మున్మున్ దత్తా షూటింగ్ లేని సమయంలో గోకుల్ ధామ్ సెట్లను వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గత 18 సంవత్సరాలుగా ఈ షోతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సెట్లలో తాను పెరిగానని, ఇక్కడ ప్రతీ జ్ఞాపకం తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుందని ఆమె తెలిపారు.