వైఎస్ షర్మిల కుమార్తె వివాహం: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఆహ్వానం
రిపోర్టర్: రాము
స్థలం: విజయవాడ
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహ వేడుకకు సంబంధించి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లిన ఆమె, నవంబర్ 25వ తేదీన జరగనున్న అంజిలిరెడ్డి వివాహానికి రావాలని కోరారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కుటుంబ సమేతంగా వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని షర్మిల కోరినట్లు ఆయన పేర్కొన్నారు.