అక్టోబర్ 11 నుంచి విజయవాడలో ఘనంగా ఉత్సవాలు

రిపోర్టర్: శివ స్థలం: విజయవాడ

విజయవాడలో దసరా సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. నగరానికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారని, కనకదుర్గమ్మ ఆశీస్సులతో అభివృద్ధి వేగవంతమవుతోందని తెలిపారు. అక్టోబర్ 8 నుంచి 23 వరకు నేషనల్ సరస్సు మేళా కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. పున్నమి ఘాట్, ఎంబీకే స్టేడియంలలో ఈ వేడుకలు జరగనున్నాయని, మైసూరు ఏనుగులను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.