వైద్య విద్యలో ప్రతిభ చాటిన పల్లె పడుచుకు అరుదైన సన్మానం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కడ్తాల్

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామానికి చెందిన సబావత్ యాదగిరి నాయక్, శారద దంపతుల కూతురు పండు ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి ప్రముఖ అపోలో ఆసుపత్రిలో సీటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రేమ జవహార్ లాల్ నాయక్, ఉపసర్పంచ్ హీరాసింగ్ నాయక్, గ్రామ పెద్దలు స్టాలిన్, కిషన్, తులసిరామ్, రాము, చత్రువు, నరేష్, సునీల్ కుమార్, సాము, చందు, రమేష్, సరియా, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.