పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పెద్దపల్లి

రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. పెద్దపల్లి పట్టణంలోని జంక్షన్ల వద్ద ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించి తక్షణమే అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్, కాట్నపల్లి నిరుకుళ్ల ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. విదేశాల్లో లభిస్తున్న ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జర్మనీ, ఇజ్రాయెల్, ఆస్ట్రియా, ఐర్లాండ్ తదితర దేశాల్లో వివిధ కొలువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ద్వారా తెలిపారు.