నల్గొండ జిల్లాలో మళ్లీ పంజా విసురుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా

రిపోర్టర్: మహేష్ స్థలం: নালగొండ

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతీపురంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని దళారులు సేకరించి సరిహద్దు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సన్నబియ్యం పంపిణీ అక్రమార్కులకు వరంగా మారిందని, నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే వారిపై పౌరసరఫరాలు, పోలీసు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ హెచ్చరించారు.