ఉద్యోగం ఆశ చూపి మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు

రిపోర్టర్: సురేష్ స్థలం: దిల్లీ

దిల్లీలోని మాండవాలి ప్రాంతంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి నలభై ఏళ్ల మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. లక్ష్మీనగర్కు చెందిన దీపక్ బన్సల్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి బంగారు నగలను దోచుకోవడంతో పాటు, అసభ్యకర వీడియోతో బెదిరింపులకు పాల్పడి పరారైన నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.