యాభై కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్పరం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఇబ్రహీంపట్నం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్పల్లి గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 96లో సుమారు యాభై కోట్ల రూపాయల విలువైన నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తి పేరుపైకి మారినట్లు అధికారులు వెల్లడించారు. తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి వహీదా బేగం అనే వ్యక్తికి అక్రమంగా పట్టా పాసుపుస్తకం జారీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ భారీ భూ కుంభకోణంపై రెవెన్యూ శాఖ అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.