స్థానిక ఎన్నికల నామినేషన్లపై ఎస్ఈసీ సంచలన నిర్ణయం: భారీ ఊరట
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ల ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఊరట కల్పించిందని అధికారులు తెలిపారు. నామినేషన్ల దాఖలు సమయంలో ఎన్ఓసి, నో డ్యూ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఆ సర్టిఫికెట్లు లేవనే కారణంతో ఏ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించవద్దని రిటర్నింగ్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. చట్టంలో ఆ నిబంధన లేదని స్పష్టతనిచ్చారు.