సినిమా కబురు: హైదరాబాద్లో ఘనంగా కిల్లర్ సినిమా ట్రైలర్ విడుదల

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

జ్యోతి పూర్వాజ్ మరియు పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కిల్లర్ సినిమా ట్రైలర్ను హైదరాబాద్లో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఘనంగా విడుదల చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రం ఈనెల ముప్పైవ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని దర్శకుడు, నిర్మాత పూర్వాజ్ తెలిపారు. మూడు వేర్వేరు కాలాల నేపథ్యంతో వినూత్నమైన థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందిందని ఆయన పేర్కొన్నారు.