అస్సాం ముఖ్యమంత్రితో భేటీ: గువాహటిలో ఈటల రాజేందర్ కీలక సమావేశం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో భేటీ అయినట్లు మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. గువాహటిలోని లోక్ సేవా భవన్లో ఈ సమావేశం అత్యంత ఫలప్రదంగా ముగిసిందని ఆయన తెలిపారు. ఈ భేటీలో బీజేపీ తెలంగాణ నేతలు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, గండె సుధాకర్ తదితరులు పాల్గొన్నట్లు ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాజకీయ పరిణామాలు మరియు పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు ఆయన స్పష్టం చేశారు.