కోదాడ మెగా జాబ్ మేళా విజయవంతం: 5,600 ఉద్యోగాల కల్పన
రిపోర్టర్: మహేష్
స్థలం: సూర్యాపేట
కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళా దిగ్విజయంగా ముగిసిందని మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రత్యేక ఉపాధి కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు ఒక్కరోజే 5,600 ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.