ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ బాటపట్టిన కుటుంబాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామపంచాయతీ పరిధికి చెందిన బీఆర్ఎస్, సీపీఐ పార్టీల నుండి ఇరవై ఐదు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. నగరంలోని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై భారీగా చేరుతున్నారని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అండగా ఉంటామని ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు.