పరిశ్రమల కాలుష్యంపై సీపీఎం ఆధ్వర్యంలో చౌటుప్పల్లో భారీ మహాధర్నా

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలంలో అంతమ్మగూడెం, దోతిగూడెం కెమికల్ పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. గ్రామాల నుండి ఆర్డీవో కార్యాలయం వరకు పదకొండు కిలోమీటర్ల మేరె పాదయాత్ర చేపట్టారు. కాలుష్యంతో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎకరానికి ఏడాదికి యాభై రెండు వేల రూపాయల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.