ఆపరేషన్ ఫైర్వాల్: ఏపీలో పాకిస్తాన్ గూఢచర్య నెట్వర్క్ గుట్టురట్టు చేసిన అధికారులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా దేశ రక్షణ రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్న గూఢచర్య నెట్వర్క్ను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆపరేషన్ ఫైర్వాల్ పేరుతో ఛేదించినట్లు అధికారులు తెలిపారు. పది రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి పదమూడు మంది నేవీ సిబ్బందితో సహా పద్దెనిమిది మందిని గుర్తించామని వెల్లడించారు. కీలక నిందితుడు సాయివరప్రసాద్ను అరెస్ట్ చేసి విశాఖ జైలుకు తరలించామని, ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.