ఢిల్లీలో కాలేజ్ విద్యార్థినిని వేధించి స్కూటీని ఢీకొట్టిన దుండగులు
రిపోర్టర్: సునీల్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఇంటర్వ్యూ ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తున్న ఇరవై ఒక్క ఏళ్ల డిజైన్ విద్యార్థినిని ఇద్దరు దుండగులు బైక్ పై వెంబడించి వేధించారు. ఆమెను మాటలతో వేధించడమే కాకుండా స్కూటీని ఢీకొట్టడంతో బాధితురాలు కిందపడి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.