హాలీవుడ్లో సంచలనం: భర్త షియా లబౌఫ్కు విడాకులు కోరిన ప్రముఖ నటి మియా గోత్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: లాస్ ఏంజెల్స్
హాలీవుడ్ ప్రముఖ నటి మియా గోత్ తన భర్త, నటుడు షియా లబౌఫ్తో వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో లాస్ ఏంజెల్స్ కౌంటీ కోర్టులో ఆమె విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు న్యాయస్థాన పత్రాలు స్పష్టం చేస్తున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించారు. గత ఏడాది జూలైలో వీరు విడిపోయినట్లు కోర్టుకు సమర్పించిన దస్తావేజుల ద్వారా అధికారికంగా తేలింది.