నారాయణపేటలో ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించడంపై ఎస్పీ వినీత్ హర్షం
రిపోర్టర్: గోపి
స్థలం: నారాయణపేట
గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరియు తాఖీ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలను నారాయణపేట జిల్లాలో అత్యంత ప్రశాంతంగా ముగించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సహకారం, ఉత్సవ కమిటీల బాధ్యతాయుత వ్యవహార శైలి, హిందూ-ముస్లిం పీస్ కమిటీల సభ్యులు, మత పెద్దలు అలాగే ప్రజాప్రతినిధుల సమన్వయం వల్లనే ఈ వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా ముగిశాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.