స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత: రెండ్రోజుల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు పూర్తిగా సఫలమయ్యాయని, గెలుపే ప్రాతిపదికగా రెండు రోజుల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాస్‌లు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ, రెండు పార్టీల కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా, జనసేన క్యాడర్‌ను పూర్తిగా సంతృప్తి పరిచేలా సీట్ల కేటాయింపులు ఉంటాయని తెలిపారు.