అనంతపురం ఉన్మాది హేమంత్ కాలు తొలగింపు: సర్జరీ చేసినట్లు వైద్యులు వెల్లడి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అనంతపురం
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి వెల్లడించిన వివరాల ప్రకారం, పదో తరగతి విద్యార్థినిపై దాడి చేసిన ఉన్మాది హేమంత్ కుడికాలిని మోకాలి పైవరకూ తొలగించారు. ఆత్మకూరు అడవుల్ లో పోలీసులు జరిపిన కాల్పుల్ లో నిందితుడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కుడికాలికి రక్త సరఫరా నిలిచిపోయి కుళ్లిపోవడంతో సోమవారం అర్ధరాత్రి తర్వాత వైద్యులు ఆపరేషన్ చేసి కాలిని తొలగించారు. ప్రస్తుతం అతడిని ఏఎంసీకి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు.