థానేలో రద్దీ కారణంగా లోకల్ రైల్వే నుండి కింద పడిన మహిళ

రిపోర్టర్: నరేష్ స్థలం: మహారాష్ట్ర

థానేలో భారీ రద్దీ కారణంగా దివా, ముంబ్రా స్టేషన్ల మధ్య ఓ మహిళ కదులుతున్న లోకల్ రైలు నుండి కింద పడింది. సిగ్నల్ పడటంతో రైలు నిలిచిపోయిన సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని రైల్వే పోలీసులు తెలిపారు.