జూరాల ఆయకట్టు రైతుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం
రిపోర్టర్: రాము
స్థలం: పాలమూరు
జూరాల ఆయకట్టు పొలాలకు సాగునీళ్లు ఇవ్వాలని కోరుతూ నిరసన తెలుపుతున్న రైతులు మరియు ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము. రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేల అరెస్టులు అప్రజాస్వామికమని, ప్రభుత్వం ఈ అణచివేత చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.