క్రీడాస్ఫూర్తితో ఉప్పొంగుతున్న పారాది గడ్డపై సాఫ్ట్ బాల్ సమరం

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామ జిల్లాపరిషత్ హైస్కూల్లో పదమూడవ సబ్ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్ టోర్నమెంటు ఘనంగా ప్రారంభమైంది. ఈ పోటీలకు ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పదిహేను జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో మూడు రోజులపాటు ఈ టోర్నమెంటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడారంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నేతలు స్పష్టం చేశారు.