క్రీడాకోట్లపై జగన్ అజ్ఞానపు విమర్శలను ఖండించిన కూన రవికుమార్
రిపోర్టర్: Bobbili GANESH
స్థలం: బొబ్బిలి
క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా విమర్శలు చేయడం తగదని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు. పారాదిలో జరిగిన సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ వేదికగా ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకోటా ఉంటుందనే కనీస జ్ఞానం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని, క్రీడాకారులకు నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.