తల్లి అయినంత మాత్రాన కెరీర్ ఆగిపోదు: పరిణీతి చోప్రా

రిపోర్టర్: వెంకట్ స్థలం: భారతదేశం

తల్లైన తర్వాత కూడా నటీమణులు లీడ్ రోల్స్‌లో కొనసాగుతున్నారని బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా స్పష్టం చేశారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు మారిపోయాయని, ఇప్పుడు ప్రేక్షకులు మదర్స్‌ను ఇగ్నోర్ చేయడం లేదని తెలిపారు. దీపిక, ఆలియా, ప్రియాంక వంటి నటీమణులు తల్లులైన తర్వాత కూడా అదే క్వాలిటీ వర్క్ ఇస్తున్నారని, నటించాలనే ఆసక్తి ఉన్నంతకాలం తల్లితనం కెరీర్‌కు అడ్డంకి కాకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.